ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ఉద్యోగులకు సెలవు
జనవరి 22న జమ్మూ కశ్మీర్‌లో సగం రోజు(మధ్యాహ్నం 2.30 గంటల వరకు) పాటించాలని ఆదేశిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించింది. అలాగే, సోమవారం డ్రైడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 22న జమ్మూ కశ్మీర్‌లో సగం రోజు(మధ్యాహ్నం 2.30 గంటల వరకు) సెలవు పాటించాలని ఆదేశిస్తున్నట్టు కమిషనర్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సంజీవ్ వర్మ ఉత్తర్వులను జారీ చేశారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) విభాగం వారికి ఇది వర్తిస్తుందని తెలిపారు. మరో ఉత్తర్వులో ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని 36 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో జనవరి 22న డ్రై డేగా ప్రకటిస్తున్నామని, రిటైల్ వ్యాపారులు మద్యం విక్రయించడానికి అనుమతి ఉండదని ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ చెప్పారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి జనవరి 23 ఉదయం 9 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు.