ఉగాండాలో దారుణం.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేశాడు..
ఉగాండాలో దారుణం జరిగింది.
కంపాలా: ఉగాండాలో దారుణం జరిగింది. ప్రత్యర్థుల దాడి నుంచి కాపాడాల్సిన రక్షక భటుడే మంత్రిని కాల్చి చంపాడు. ఉగాండా రాజధాని కాంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలాతో బాడీగార్డ్ కు మంగళవారం ఉదయం వాగ్వాదం జరిగిందని, వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో మంత్రిని అంతమొందించిన బాడీగాడ్ విల్సన్ సబిజిత్ తర్వాత తనను తాను కల్చుకొని చనిపోయాడని ఆ దేశ సైనికాధికారి ఫెలిక్స్ కులాయిగ్వే తెలిపారు.
ఈ ఘటనను దురదృష్టకరమైనదని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామన్నారు. అయితే.. బాడీగార్డుకు గత కొంత కాలంగా జీతం చెల్లించడం లేదని, దానిపైనే మంత్రి నివాసంలో వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది.