IT Returns: ట్యాక్స్ పేయర్స్ కు గుడ్‌న్యూస్.. ఐటీ రిటర్న్స్ గడువు మరోసారి పెంపు..!

పన్ను చెల్లింపుదారులకు(Taxpayers) ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2024-12-01 10:11 GMT

దిశ,వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులకు(Taxpayers) ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) గుడ్‌న్యూస్ చెప్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి(Financial Year) సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల(ITR)ను సమర్పించేందుకు గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(CBDT) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు నిన్నటితో ముగియగా.. తాజాగా దాన్ని మరో 15 రోజుల వరకు పొడిగించింది. ఆదాయ పన్ను చట్టం, 1961కి లోబడి సెక్షన్‌ 139(1) కింద ఐటీ రిటర్నుల గడువు తేదీని పెంచినట్లు వెల్లడించింది. ట్యాక్స్ పేయర్స్ సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.

Tags:    

Similar News