ఇరాన్ ప్రెసిడెంట్ దుర్మరణం.. స్వదేశంలో బాణాసంచాలు కాల్చి సంబరాలు

ఇరాన్ అధ్యక్షుడు దుర్మణంపై కొందరు సంబరాలు జరుపుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-05-20 09:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ దేశ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్ బైజైన్ సరిహద్దుల్లో కుప్పుకూలింది. కాగా రైసీ మరణంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహ పలు ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిగ్ర్భాంతికరమైన సందర్భంలో కొందరు ఇరానీయులు మాత్రం సంబరాలు చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్ క్రాష్ అయిందన్న సమాచారం తెలిసిన వెంటనే స్వదేశంతో పాటు ఆయా దేశాల్లో ఉన్న కొంత మంది ఇరానియన్లు సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైసీ హెలికాప్టర్ ప్రమాదం సంగతి తెలియగానే ఇరాన్ లో కొందరు బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్న వీడియోలను ఇనాన్ ఇంటర్నేషనల్ న్యూస్ పోస్ట్ చేసింది. మహిళా హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజాద్ ట్వీట్ చేస్తూ... ఈ రోజును ప్రపంచ హెలికాప్టర్ డేగా ప్రకటించారని కోరారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక క్రాష్ ఇదే అవుతుందని పేర్కొన్నారు. లండన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం ముందు కొందరు ఇరానీయులు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. మరి కొందరు ఈ ప్రమాదం క్రాష్ ల్యాండ్ కంటే దీని వెనుక ప్రత్యర్థుల కుట్ర ఉందంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.

రైసీపై ఆగ్రహమెందుకు?:

గతంలో న్యాయశాఖకు నేతృత్వం వహించిన 63 ఏళ్ల రైసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఆ దేశంలో తిరుగుబాటును నియంత్రించడానికి కృూరంగా వ్యవహరించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అలాగేఇరాన్ ఇప్పటి వరకు చూడని అత్యంత సాంప్రదాయిక అధ్యక్షులలో రైసీ ఒకరని, అలాగే క్రూరమైన న్యాయ వ్యవస్థ ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడని చెబుతున్నారు. అపఖ్యాతి పాలైన 'ప్యానెల్ ఆఫ్ డెత్'లో రైసీ ఒక సభ్యుడు అని 1988లో ఇరాక్-ఇరాన్ యుద్ధం సందర్భంగా చిక్కిన ఖైదీలకు సామూహికంగా ఉరి తీసి అపఖ్యాతి పొందారు. అలాగే విస్తృతమైన బ్యూరోక్రాటిక్ అవినీతి, ఆర్థిక దుర్వినియోగం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం. కఠినమైన సెన్సార్‌షిప్ వంటి అంశాల్లో రైసీపై ఆ దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. 

Click Here For Twitter Post..

Tags:    

Similar News