సునితా విలియమ్స్ రోదసియాత్ర.. మూడోసారి వెళ్లిన మహిళగా రికార్డు
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసిలోకి వెళ్లారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆమె యాత్ర ప్రారంభమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసిలోకి వెళ్లారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆమె యాత్ర ప్రారంభమైంది. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే బోయింగ స్టార్ లైన్ రాకెట్ లో సునితాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు రోదసిలోకి వెళ్లారు. ఐఎస్ఎస్ కు చెందిన హార్మోనీ మాడ్యూల్ సబ్ సిస్టమ్స్ పనితీరుపై వారంరోజులపాటు పనిచేయనున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ మిషన్
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. కాగా.. జూన్ 1న జరిగాల్సిన ప్రయోగం కూడా చివిరినిమిషయంలో ఆగిపోయింది. ఇకపోతే 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు సునితా విలియమ్స్. రెండు మిషన్లలో 322 అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సునిత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేశారు. నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపి.. 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.
Thank you to our teams and partners @NASA, @ulalaunch, @NASAKennedy, @SLDelta45, and @NASA_Johnson for your vital role in today's #Starliner launch. pic.twitter.com/D1X1o2RXSw
— Boeing Space (@BoeingSpace) June 5, 2024