Indian Navy: ఇండియన్ నేవీకి సరికొత్త చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ(Narendra Modi)..

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీకి సరికొత్త చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ కొత్త చిహ్నంతో ఉన్న పతాకాన్ని ఎగురవేశారు..Latest Telugu News

Update: 2022-09-02 09:32 GMT

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీకి సరికొత్త చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ కొత్త చిహ్నంతో ఉన్న పతాకాన్ని ఎగురవేశారు. గతంలో ఇండియన్ నేవీకి ఉన్న చిహ్నం దేశ వలసవాదాన్ని గుర్తు చేసేలా ఉందని కేంద్రం భావించింది. ఈ క్రమంలో కొత్త చిహ్నంతో ఉన్న గుర్తును ప్రధాని మోడీ ఆవిష్కరించారు. మారాఠా సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో చిహ్నం(నిషాన్) రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే ఈ చిహ్నానికి ఉన్న ప్రత్యేకతలను వెల్లడించింది.

నిషాన్ ప్రత్యేకతలు..

భారత నావికా దళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఎడమవైపు జాతీయ పతాకాన్ని, కుడివైపు నీలం, బంగారు వర్ణంలో ఉన్న అష్టభుజాకారంలో చిహ్నం. ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు బంగారు వర్ణ బోర్డర్లు ఉంటాయి. దాని కిందనే 'సత్యమేవ జయతే' అనే అక్షరాలు కనిపిస్తాయి. ఈ అక్షరాలను దేవనాగరి లిపిలో రాశారు. ఈ రెండు చిహ్నాల కింద భారత నావికా దళం నినాదం 'సమ్ నో వరుణః' అనే అక్షరాలను దేవనాగరి లిపిలో రాశారు. సమ్ నో వరుణః అంటే అర్థం 'వరుణ దేవుడా మాకు అంతా శుభం కలుగుగాక'. ఈ అష్టభుజాకారం నౌకదళ బహుళ కార్యచరణ సామర్థ్యం, దిశల పరిధిని సూచించగా.. యాంకర్ చిహ్నం స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే నీలం రంగు సముద్ర సామర్థ్యాన్ని తెలుపుతుంది. అలాగే ఈ అష్టభుజాకారం చుట్టూ రెండు బంగారు రంగు బోర్డర్లు కనిపిస్తాయి. దీన్ని ఛత్రపతి శివాజీ రాజముద్ర నుంచి తీసుకున్నారు. తెలుపు రంగు భారత నావికా దళ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాగా, ఛత్రపతి శివాజీ హయంలో పటిష్టమైన నౌక దళాన్ని నిర్మించారు. దాదాపు 60 యుద్ధనౌకలు, 5 వేల మంది సైన్యం నౌకాదళంలో పని చేసే వారని సమాచారం. 

Also Read : ఆ దేశాల జాబితాలో చేరిన భారత్.. కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి: PM Modi 

Tags:    

Similar News