రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ.. రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న నెటిజన్లు

Update: 2024-07-04 08:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో అబద్ధం చెప్పిన రక్షణ మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ఓ వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోకు క్యాప్షన్ గా రాహుల్ ఇలా రాసుకొచ్చారు. అమరవీరుడు అగ్నివీర్ కుటుంబానికి సహాయం అందుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో అబద్ధం చెప్పారు. అమరవీరుడు అగ్నివీర్‌ అజయ్‌సింగ్‌ అబద్ధాలపై ఆయన తండ్రి స్వయంగా నాతో నిజాలు చెప్పారు. వారికి ఎటువంటి సహాయం అందలేదు. ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకు, దేశానికి, సైన్యానికి, అమరవీరుడు అజయ్ సింగ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే రాహుల్ ట్వీట్ పై ఇండియన్ ఆర్మీ స్పందించింది.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు పరిహారం చెల్లించలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వచ్చాయి. అగ్నివీర్ అజయ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోందని, పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయని, ఆయనకు సహాయకంగా చెల్లించాల్సిన మొత్తంలో అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే రూ.98.39 లక్షలు చెల్లించినట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అగ్నివీర్ విషయం పదే పదే ఇలాంటి అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదిస్తున్నాడని.. అతను వెంటనే దేశ ప్రజలకు, ఆర్మీకి, అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంభానికి క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News