ఇండియ‌న్ ఆర్మీ క‌ట్టిన‌ మొద‌టి 3డి ఇళ్లు! ఇక‌పై అంతా అవేనా..?!

మ‌నిషికి సౌక‌ర్య‌వంత‌మైన మార్గాలు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నాయి. Indian Army constructed First-ever 3D Printed Houses.

Update: 2022-03-18 06:35 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః నానాటికీ అభివృద్ధిచెందుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో మ‌నిషికి సౌక‌ర్య‌వంత‌మైన మార్గాలు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఇల్లు క‌ట్టాలంటే ఎంతో సామ‌గ్రితో పాటు మ‌నుషుల అవ‌సరం కూడా చాలా ఉండేది. అయితే, ప్ర‌స్తుతం నిర్మాణంలో వ‌చ్చిన మార్పుల‌తో యంత్రాలే ఎక్క‌వ ప‌నిని చేసేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయంగా 3డి భ‌వ‌న నిర్మాణం రైజ్ అవుతోంది. ఫ్లెక్సీ బ్యాన‌ర్‌ను ప్రింట్ చేసిన‌ట్లు, డిజైన్ ఇస్తే యంత్ర‌మే ఇల్లు క‌ట్టి ఇచ్చేస్తుంది. అలా ఇప్పుడు ఇండియ‌న్ ఆర్మీ ఇంజినీర్లు కూడా తొలిసారిగా గుజరాత్‌లో సైనికుల కోసం 3డి ప్రింటెడ్ హౌస్‌లను నిర్మించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (MES) ఆధ్వ‌ర్యంలో గాంధీనగర్‌లోని సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో మొట్టమొదటి 3డి ప్రింటెడ్ హౌస్‌లను పూర్తి చేశారు. వేగవంతమైన నిర్మాణ సాంకేతికతను ఉపయోగించడం వల్ల‌ కేవలం నాలుగు వారాల్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌లతో పూర్తిగా 3డి కాంక్రీట్ ప్రింటెడ్ ఇళ్ల‌ను నిర్మించారు.

Tags:    

Similar News