India-Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యాఖ్యలను ఖండించిన భారత్

తప్పుడు సమాచారంతో చేసినట్టుగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.

Update: 2024-09-16 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోని మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇరాన్ సుప్రీం లీడర్ భారత్‌లోని మైనారిటీల గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుడు సమాచారంతో చేసినట్టుగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లోని మైనారిటీలపై మాట్లాడే ముందు ఖమేనీ తమ సొంత దేశంలోని రికార్డులను చూసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అలీ ఖమేనీ ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ముస్లింల కష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజా, మయన్మార్‌తో పాటు భారత్‌లో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని పట్టించుకోవాలని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై మాట్లాడుతూ..కశ్మీర్‌లో ముస్లింల పరిస్థితిపై తమకు ఆందోళన ఉంది. భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ కశ్మీర్‌లోని ప్రజల పట్ల భారత ప్రభుత్వం న్యాయమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ సభ్యుల మధ్య సంఘీభావం కోసం ఖమేనీ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News