లఢఖ్‌లో చైనాతో ప్రమాదకర పరిస్థితులు.. విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లఢఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల మిలిటరీ అత్యంత దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ‘సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పటికీ చాలా పెళుసుగా ఉంది. ఎందుకంటే మా మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయి. సైనిక అంచనాలో చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి’ అని జైశంకర్ అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. రాహుల్‌కు చైనా అంటే ఇష్టమని, భారత్ అంటే అసమ్మతి ఉందని దుయ్యబట్టారు. సరిహద్దులు ఒప్పందాలను ఉల్లంఘణ కొనసాగినన్ని రోజులు చైనాతో సంబంధాలు సాధారణంగా ఉండవని చెప్పారు. 2020లో గల్వాన్ ఘటనలో 20 మందికి పైగా భారత సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.