ఐదు దేశాలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారత్ సాయం
నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్‌లు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారుచేస్తుకుంటున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలు ముందుగా హెచ్చరించే వ్యవస్థను రూపొందిస్తున్న ఐద్ దేశాలకు భారత్ సాయం చేస్తోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్‌లు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారుచేస్తుకుంటున్నాయి. ఆయా దేశాలకు భారత్ టెక్నాలజీ సహాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి ఈ ఐదు దేశాలను రక్షించే క్రమంలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ప్రమాదకర వాతావరణం, నీరు, వాతావరణ విపత్తుల నుంచి రక్షణ కోసం 2027 నాటికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించుకోవాలని 2022లో ఐక్యరాజ్యసమితి సూచించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 దేశాలలో ఐదింటికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసే చొరవలో మొదటి దశ కోసం భారత్ సహాయం చేస్తోందని మహపాత్ర తెలిపారు. ఈ ఐదు దేశాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1970-2021 మధ్య 12 వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. దీనివల్ల 20 లక్షల కంటే ఎక్కువ మరణాలు, లక్షల కోట్ల నష్టం జరిగింది.