Hypersonic Missiles : త్వరలో భారత సైన్యం అమ్ములపొదిలోకి ‘నిర్భయ్’, ‘ప్రళయ్’

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోని పలు ప్రాంతాలను యుద్ధ మేఘాలు కమ్మేసిన ప్రస్తుత తరుణంలో లాంగ్ రేంజ్ మిస్సైళ్ల అభివృద్ధిపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Update: 2024-09-27 14:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోని పలు ప్రాంతాలను యుద్ధ మేఘాలు కమ్మేసిన ప్రస్తుత తరుణంలో లాంగ్ రేంజ్ మిస్సైళ్ల అభివృద్ధిపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2వేల కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల నిర్భయ్ మిస్సైల్, 400 కి.మీ టార్గెట్ రేంజ్ కలిగిన ప్రళయ్ మిస్సైల్‌ను ఆర్మీకి అందించే దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఈ మిస్సైళ్లను తయారు చేసి ఆర్మీకి అందించే అంశంపై రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దృష్టి పెట్టినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

‘‘స్వదేశీ రాకెట్ ‘పినాక’ టార్గెట్ రేంజ్ ప్రస్తుతం 90 కి.మీ మాత్రమే. దాన్ని 300 కి.మీ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’’ అని భారత ఆర్మీ ఆర్టిల్లరీ రెజిమెంట్ డైరెక్టర్ జనరల్ ఎ.కుమార్ వెల్లడించారు. భారత ఆర్మీకి ప్రళయ్, నిర్భయ్ మిస్సైళ్లను అందించే ప్రతిపాదనకు ఇప్పటికే రక్షణశాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం లభించిందన్నారు. హైపర్ సోనిక్ మిస్సైళ్ల అభివృద్ధిపైనా డీఆర్‌డీఓ సీరియస్‌గా పనిచేస్తోందని ఆయన తెలిపారు. సెన్సర్ల సాయంతో శత్రు లక్ష్యాలను గుర్తించి ఆటోమేటిక్‌గా కాల్పులు జరిపే స్మార్ట్ ఆయుధాల అభివృద్ధి కోసం ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని భారత ఆర్మీ ఆర్టిల్లరీ రెజిమెంట్ డైరెక్టర్ జనరల్ ఎ.కుమార్ చెప్పారు.


Similar News