MEA: జైశంకర్ పై దాడికి యత్నం.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ

కేంద్ర మంత్రి జైశంకర్‌ పై బ్రిటన్ లో దాడికి యత్నించిన ఘటనపై విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రశక్తుల బెదిరింపులపై బ్రిటన్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది.

Update: 2025-03-07 16:41 GMT
MEA: జైశంకర్ పై దాడికి యత్నం.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి జైశంకర్‌ పై బ్రిటన్ లో దాడికి యత్నించిన ఘటనపై విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రశక్తుల బెదిరింపులపై బ్రిటన్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది. వారి చర్యలకు లైసెన్స్ ఇచ్చినట్లుగానే ఈ ఘటన కన్పిస్తోందని పేర్కొంది. బ్రిటన్ అధికారుల దగ్గర ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశామంది. చేతనయితే ఈ దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనకు కారణాన్ని అర్థం చేసుకోవాలి. బ్రిటన్‌లో భారత దౌత్య కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఉద్దేశంతో చేసిన బెదిరింపులుగా పరిగణించాలి. ఇలాంటి ధోరణికి పాల్పడే ఖలిస్థానీ శక్తులపై యూకే ఉదాసీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది’’ అ మీడియా సమావేశంలో అన్నారు.

కేంద్రమంత్రిపై దాడికి యత్నం

జైశంకర్ ఐదురోజుల లండన్ పర్యటనకు వెళ్లారు. కాగా.. లండన్ లోని ఛాతమ్ హౌస్ లో జరిగిన అధికారిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూలురు ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ కు, విదేశాంగ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో గుంపులోని ఒక వ్యక్తి భారత జెండాను పట్టుకుని జైశంకర్ కారు సమీపంలోకి వచ్చి, మన జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపైనే విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది.


Similar News