INC: బీజేపీ వాగ్ధానాలు తీర్చలేదు.. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికలలో బీజేపీ(BJP) వాగ్ధానాలు(Promises) చేసి తీర్చలేదని, మహా వికాస్ అఘాడి(Maha Vikas Aghadi) రైతులకు న్యాయం(Justice To The Farmers) చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: గత ఎన్నికలలో బీజేపీ(BJP) వాగ్ధానాలు(Promises) చేసి తీర్చలేదని, మహా వికాస్ అఘాడి(Maha Vikas Aghadi) రైతులకు న్యాయం(Justice To The Farmers) చేస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi) అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల(Maharashtra Elections) నేపథ్యంలో రైతుల సమస్యల(Farmers' Problems)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్.. మహారాష్ట్ర రైతుల(Maharashtra Farmers) కోసం మహా వికాస్ అఘాడి చరిత్రాత్మక అడుగులు వేయనుందని తెలిపారు.
సోయాబీన్(Soybean) కోసం క్వింటాల్ కు ఏడు వేల రూపాయల ధరతో పాటు ఎంఎస్‌పీ(MSP), బోనస్(Bonus) కలిపి ఇస్తామని చెప్పారు. అలాగే ఉల్లి(Onion)కి సరైన ధర నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, పత్తి(Cotton) పంటకు కూడా ఎంఎస్‌పీ అనేది హక్కు(Right) అని నినదించారు. అంతేగాక గత మూడు ఎన్నికలలో సోయాబీన్‌కు ఆరు వేల రూపాయల ఎంఎస్‌పీ ఇస్తామని బిజెపి వాగ్దానం చేసింది, కాని నేటికీ రైతులు తమ కష్టపడి పండించిన సోయాబీన్‌ను 3 వేల నుంచి 4 వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇక మహా వికాస్ అఘాడి రైతులకు వారి హక్కులు, కృషి ఫలాలు, న్యాయం అందిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.