ఢిల్లీలో బీహార్ ఎంపీ డ్రైవర్ కారుతో హల్ చల్
ఢిల్లీలో బీహార్ ఎంపీ చందన్‌సింగ్ డ్రైవర్ రాంచంద్ కుమార్ హల్ చల్ చేశారు. తన కారు బ్యానెట్‌పై వేలాడుతున్న వ్యక్తిని 2-3 కిలోమీటర్ల తీసుకెళ్లారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో బీహార్ ఎంపీ చందన్‌సింగ్ డ్రైవర్ రాంచంద్ కుమార్ హల్ చల్ చేశారు. తన కారు బ్యానెట్‌పై వేలాడుతున్న వ్యక్తిని 2-3 కిలోమీటర్ల తీసుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో చందన్‌సింగ్ డ్రైవర్ ఢిల్లీ ఆశ్రమ చౌక్ నుంచి కారులో వెళ్తున్నారు. ఆయనకు ఎదురుగా మరో కారు వెళ్తోంది. అయితే రాంచంద్ కుమార్ స్పీడ్‌గా డ్రైవ్ చేసి ఎదురుగా ఉన్న కారును మూడుసార్లు ఢీకొట్టారు. దీంతో సదరు వ్యక్తి కారును రోడ్డుపై ఆపి రాంచంద్ కుమార్ కారుకు ఎదురుగా నిలబడి ప్రశ్నించారు.
దీంతో ఆగ్రహానికి గురైన రాంచంద్ కుమార్ .. సదరు వ్యక్తిని ఢీకొట్టారు. కారు బ్యానెట్‌పై ఆ వ్యక్తిని ఆశ్రమచౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వరకు తీసుకెళ్లారు. ఆపమని అడిగినా ఆపకుండా తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు ఏమీ కాకపోవడంతో సదురు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సన్ లైట్ కాలనీ పోలీసులు నిందితుడు రాంచంద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే బాధితుడు చేతన్ మాట్లాడుతూ తాను ఎంత ఆపమన్నా కారును రాంచంద్ కుమార్ ఆపలేదని తెలిపారు. పూర్తిగా ఆయన తాగి ఉన్నారని చెప్పారు. నిందితుడు రాంచంద్ కుమార్ మాట్లాడుతూ ‘‘ నా కారు అతనికి కారును ఢీకొట్టలేదు. ఉద్దేశపూర్వకంగా నా కారుపై ఆయన దూకారు. ఆ సమయంలో నేను డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. దిగమని చెప్పినా దిగలేదు. కారును ఆపి ఏమి చేస్తున్నావు అని అడిగాను.’’ అని తెలిపారు.