Pulwama Question : పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు.. జవాన్లు బార్డర్ వదిలేస్తే ఎలా ఉండేది ? : వైద్యులకు టీఎంసీ నేత ప్రశ్న

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటన నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-08-21 15:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటన నేపథ్యంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు వైద్య సంఘాలు, మరోవైపు బీజేపీ నుంచి టీఎంసీ సర్కారు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘2019 సంవత్సరంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆ సమయంలో మిగతా జవాన్లు కూడా సరిహద్దు భద్రతను గాలికొదిలేసి వీ వాంట్ జస్టిస్ నినాదాలతో సమ్మె చేసి ఉంటే ఎలా ఉండేది ? వాళ్లను మనం ఎలా చూసేవాళ్లం ? నిరసనకు దిగుతున్న డాక్టర్లంతా ఈ విషయాన్ని ఓసారి ఆలోచించాలి’’ అని ఆయన సూచించారు. ‘‘సైనికుల్లాగే డాక్టర్లు దేశానికి కీలకం. వాళ్లు వైద్య సేవలను ఆపడం సరికాదు’’ అని కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Tags:    

Similar News