వ్యాక్సిన్ వెసుకున్న యువకుల ఆకస్మిక మరణాలపై ICMR క్లారిటీ

గత కొంతకాలంగా వివిధ అనారోగ్యాలతో యువకులు ఆకస్మిక మరణాలు చెందుతున్నారు.

Update: 2023-11-21 07:52 GMT
వ్యాక్సిన్ వెసుకున్న యువకుల ఆకస్మిక మరణాలపై ICMR క్లారిటీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా వివిధ అనారోగ్యాలతో యువకులు ఆకస్మిక మరణాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంతో కరోనా తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నందుకు ఇలా జరుగుతుందని పలువురు సోషల్ మీడియా ద్వారా పుకార్లు పుట్టించారు. అలాగే కొంతమంది బాధితుల కుంటుంభాలు కూడా ఇలానే అభిప్రాయపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ యువకులపై పరిశోదనలు చేసింది.

అలాగే అంతకు ముందు ఆకస్మిక మరణం చెందిన వారిపై కూడా ICMR పరిశోధన చేసి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్‌-19 కోసం వేసే వ్యాక్సిన్‌లు భారతదేశంలోని యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని పెంచలేదని స్పష్టం చేసింది. అయితే కోవిడ్‌ తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక మరణానికి సంబంధించిన కుటుంబ చరిత్ర మరియు కొన్ని జీవనశైలి ప్రవర్తనలు అంతర్లీన కారణాలుగా ఉన్నాయి ICMR అధ్యయనం పేర్కొంది.


Similar News