Priyanka Gandhi: నాపై ఉంచిన నమ్మకానికి పొంగిపోయాను.. గెలుపు తర్వాత ప్రియాంక రియాక్షన్

వయనాడ్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. ఘన విజయం సాధించారు.

Update: 2024-11-23 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె వయనాడ్‌ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. “ నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. ఈ విజయం మీదే. వయనాడ్ కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎంచుకున్న మీ ఆశలు, కలలు అర్థం చేసుకుంటా. మీ కోసం పోరాడుతా. పార్లమెంటులో మీ గొంతుకను వినిపించేందుకు ఎదురుచూస్తున్నా.” అని ప్రియాంక చెప్పుకొచ్చారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన కోసం నిరంతరం శ్రమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రియాంక ఘన విజయం

వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్‌ పై 4,08,0036 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానంలో అత్యధిక ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు ప్రియాంకాగాంధీ సోదరుడు రాహుల్‌గాంధీ పేరిట ఉంది. 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో రాహుల్ గతంలో విజయం సాధించారు. ఇప్పుడు ప్రియాంకాగాంధీ ఆ రికార్డును బద్ధలు కొట్టారు.

Tags:    

Similar News