నిన్నటి ప్రమాదంలో 'నేను చనిపోయే దాన్ని': బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారుకు జరిగిన ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం. బుర్ద్వాన్ నుండి కోల్‌కతాకు రోడ్డు మార్గంలో తిరిగి వస్తుండగా చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారుకు జరిగిన ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం. బుర్ద్వాన్ నుండి కోల్‌కతాకు రోడ్డు మార్గంలో తిరిగి వస్తుండగా చోటు చేసుకుంది. దీంతో మమత తలకి స్వల్ప గాయం అయింది. కాగా ఈ ప్రమాదం అనంతరం ఆమె కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఈ ప్రమాదంలో తాను చనిపోవాల్సి ఉంది కానీ.. ప్రజల ఆశీర్వాదం వల్ల తాను సురక్షితంగా బయటపడ్డాను. ఈ ప్రమాదంపై పోలీసులు, చట్టం తన పని తాను చేస్తుందని ఆమె తెలిపింది.
అలాగే ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ, బెనర్జీ ముందు నుండి కారు వచ్చి తన వాహనాన్ని దాదాపుగా ఢీకొట్టిందని చెప్పారు. ఆ సమయంలో కారు విండో తెరిచి ఉంది అందుకే నేను బ్రతక గలిగానని చెప్పుకొచ్చింది. అలాగే.. ఈ పరిస్థితుల్లో కూడా మేము.. విద్యారంగంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేం సమావేశమయ్యామని గుర్తు చేసింది. అలాగే తన తలకు గాయం అయిందని తనకు నొప్పి, చలిగా ఉందని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకంటానని మీడియతో చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.