వారికి ముస్లిం ఓట్లు కావాలి కానీ.. కాంగ్రెస్, ఎస్పీపై అసదుద్దీన్ విమర్శలు

Update: 2022-01-29 16:39 GMT

లక్నో: ముస్లిం ఓట్ల కోసం మాత్రమే అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు ఉపయోగిస్తున్నారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 19 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు నిజాయితీ ఎటువైపు ఉంటుందో చూస్తానని అన్నారు. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. 'సెక్యులర్ అని పిలవబడే కొందరు ముస్లింలకు కార్పెట్ పరిచి జిందాబాద్ నినాదాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే మీకు టిక్కెట్లు కావాలంటే అభ్యర్థించండి. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉన్నారు' అని అన్నారు. కొన్ని ప్రాంతాల నుంచి వ్యక్తుల పిలిచి ఫోటోలు దిగి, మోసం చేస్తారా అని ఎస్పీని ప్రశ్నించారు.

ఒక మౌలానా కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా ఓ సీనియర్ కాంగ్రెస్ అభ్యర్థి అతనితో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ వివాదాస్పద నేత టీఆర్ ఖాన్‌తో దూరంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా ముజాఫర్ నగర్‌లో ఎస్పీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సీటు ఇవ్వలేదని అన్నారు. తాము ఈ సారి ఎన్నికల్లో బాబు సింగ్ కుశ్వాహా, వామన్ మెష్రామ్‌తో పాటు ఇతరులతో కలిసి కూటమిని ఏర్పాటు చేశామన్నారు. ఒక వేళ తాము అధికారంలోకి వస్తే బాబు సింగ్ కుశ్వాహా రెండున్నర ఏళ్లు, దళిత అభ్యర్థికి రెండున్నర ఏళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తెలిపారు. దీంతో పాటు ఒక ముస్లిం, ఇద్దరిని వెనుకబడిన తరగతుల నుంచి డిప్యూటీ సీఎంగా నియమిస్తామని ఇప్పటికే తెలిపారు.

Tags:    

Similar News