HRA మినహాయింపును 50% పెంచాలి: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సమావేశంలో ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) తగ్గింపు కోసం ఆదాయపు పన్ను నిబంధనలను సమీక్షించాని.. HRA ను 40 శాతం నుంచి 50 శాతం వరకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సమావేశంలో ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) తగ్గింపు కోసం ఆదాయపు పన్ను నిబంధనలను సమీక్షించాని.. HRA ను 40 శాతం నుంచి 50 శాతం వరకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నై మాత్రమే మెట్రోపాలిటన్ నగరాలుగా పరిగణించబడుతున్న ప్రాంతాలకు మాత్రమే 50 శాతం HRA నిబంధనలు ఉన్నందున.. సౌత్‌లో ఉన్న రాష్ట్రాల్లో కూడా బెంగళూరు, హైదరబాద్ వంటి మహానగరాలు ఆ జాబితాలో చేర్చి.. 50 శాతం HRA తగ్గింపు కోసం ఆదాయపు పన్ను నిబంధనలు సమీక్షించాలని ఆర్థిక మంత్రిని ఎంపీ సూర్య కోరారు. ఒక వేల సూర్య ప్రయత్నం ఫలిస్తే.. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న లక్షలాది మంది మిడిల్ క్లాస్ ఉద్యోగులకు లాభం చేకూరనుంది.
Also Read....