Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 73 రోడ్లు మూసివేత

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కాస్త తగ్గినప్పటికీ వరదల కారణంగా అధికారులు 73 రోడ్లను మూసివేశారు.

Update: 2024-08-24 18:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కాస్త తగ్గినప్పటికీ వరదల కారణంగా అధికారులు 73 రోడ్లను మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం..సిమ్లాలో 35, మండిలో 20, కాంగ్రాలో 9, కులులో 6, కిన్నౌర్‌లో రెండు, ఉనా జిల్లాలో ఒక రోడ్ బ్లాక్ చేశారు. ప్రస్తుతం తేలిక పాటి వర్షాలే కురుస్తున్నప్పటికీ మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్పమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, వర్షాకాలం ప్రారంభమైన జూన్ 27 నుంచి వర్షాలకు సంబంధించిన వివిధ సంఘటనలలో 140 మరణించగా, రాష్ట్రంలో రూ. 1212 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News