Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు.. 58 రోడ్లు మూసివేత

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 58 రోడ్లను అధికారులు మూసివేశారు. సిమ్లాలో 19, మండిలో 14, కాంగ్రాలో 12, ​​కులులో 8, కిన్నౌర్‌లో 3, సిర్మౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో ఒక్కో రోడ్డును క్లోజ్ చేశారు.

Update: 2024-08-17 17:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 58 రోడ్లను అధికారులు మూసివేశారు. సిమ్లాలో 19, మండిలో 14, కాంగ్రాలో 12, ​​కులులో 8, కిన్నౌర్‌లో 3, సిర్మౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో ఒక్కో రోడ్డును క్లోజ్ చేశారు. 12 జిల్లాల్లో ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మండిలో భారీ వర్షం కారణంగా చండీగఢ్-మనాలి జాతీయ రహదారిని సైతం బ్లాక్ చేశారు. చంబా, కాంగ్రా, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటుందని హెచ్చరించింది. పంటలతో పాటు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది. తక్లెచ్-నోగ్లీలో 30 మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది. డల్హౌసీలో అత్యధికంగా 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. కాగా, రాష్ట్రంలోని కులు, మండి, సిమ్లా జిల్లాల్లో జూలై 31న భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటి వరకు 32 మంది మరణించారు. 

Tags:    

Similar News