లోక్‌సభ ఎన్నికల్లో పోటీ, పొత్తుపై HERO విజయ్ ప్రకటన

ఫ్యాన్స్‌లో, రాజకీయ వర్గాల్లో, తమిళ ప్రజల్లో ఉన్న అనుమానాన్ని అగ్ర కథానాయకుడు దళిపతి విజయం ఇవాళ నిజం చేశారు.

Update: 2024-02-02 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాన్స్‌లో, రాజకీయ వర్గాల్లో, తమిళ ప్రజల్లో ఉన్న అనుమానాన్ని అగ్ర కథానాయకుడు దళిపతి విజయం ఇవాళ నిజం చేశారు. ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మరిన్ని కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు తెలిపారు విజయ్. ఈ క్రమంలో రెండు నెలల్లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ మద్దతు ఎవరికి ఉండబోతోందనే వార్తలు విస్తృతమయ్యాయి.

తాజాగా.. ఈ వార్తలకు కూడా విజయ్ క్లారిటీ ఇచ్చారు. చాలా క్లియర్‌గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు. అంతేకాదు.. తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా తమ పార్టీ పోరాటం ఉంటుందని వెల్లడించారు. కాగా, గత రెండేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరపున పోటీ చేసిన విజయ్ అభిమానులు 261 స్థానాలకు పోటీ పడగా 169 చోట్ల గెలుపొందారు. దీంతో ఆయనకు రాష్ట్రంలో రాజకీయం పరంగా కూడా మంచి భవిష్యత్తే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News