బార్డర్‌లో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ ఎంతంటే?

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 12కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Update: 2024-05-26 12:21 GMT
బార్డర్‌లో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ ఎంతంటే?
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 12కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సరిహద్దులోని హల్దర్‌పద గ్రామంలోని ఓ ఇంట్లో 16.07 కిలోల బరువున్న 89 బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. అనంతరం అలోక్ పాల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్య కోసం ఆయనను సమీపంలోని సరిహద్దు అవుట్‌పుట్ పోస్ట్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని, బీఎస్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో బీఎస్ఎఫ్ బంగారం స్మగ్లింగ్ బిడ్‌ను విఫలం చేసి రూ.6.7 కోట్ల విలువైన 16 బంగారు కడ్డీలను బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

Tags:    

Similar News