Mumbai Rains:ముంబాయిలో ముంచెత్తుతున్న భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ

ముంబైలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం

Update: 2024-07-26 03:22 GMT

దిశ,వెబ్‌డెస్క్ : ముంబైలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. విమానాల రాకపోకలపై ప్రభావం పడడంతో విమానాశ్రయ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ముంబై సమీపంలోని విమానాశ్రయాల్లో 11 విమానాలను రద్దు చేయగా.. 10 విమానాలను మళ్లించారు. గురువారం ఉదయం 8.30గంటల వరకు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముంబయి నగరంలో 44 మి.మీల వర్షపాతం నమోదు కాగా.. తూర్పు సబర్బన్ ప్రాంతంలో 90 మి.మీ, పశ్చిమ సబర్బన్ 89 మి.మీల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం 8.30గంటల వరకు ముంబై నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే 100, 112 నంబర్లకు కాల్ చేయండి అని సూచించారు.

Tags:    

Similar News