Health, life insurance: జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీని మినహాయించాలి..‘ఇండియా’ ఎంపీల నిరసన

పార్లమెంట్ సమావేశాలు 12వ రోజూ కొనసాగుతున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు జీవిత బీమా, ఆరోగ్య బీమాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హౌస్ వెలుపల ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.

Update: 2024-08-06 06:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ సమావేశాలు 12వ రోజూ కొనసాగుతున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు జీవిత బీమా, ఆరోగ్య బీమాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హౌస్ వెలుపల ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.18శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రంగాలపై పన్ను విధించడాన్ని టాక్స్ టెర్రరిజంగా అభిర్ణించారు. అంతకుముందు టీఎంసీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ జీవిత బీమా వంటి అత్యంత అవసరమైన వాటిపై 18 శాతం జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు.ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం) ఎంపీ మహువా మజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్ర వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

జీఎస్టీని వ్యతిరేకించిన నితిన్ గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. ఈ మేరకు ఆమెకు ఓ లేఖ రాశారు. నాగ్‌పూర్ డివిజన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్‌కు సంబంధించిన ఆందోళనలను గడ్కరీ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News