Maharashtra: ఎన్నికల వేళ మహారాష్ట్ర అధికార కూటమిలో విభేదాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Polls) వేళ అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు ఏర్పడ్డాయి.

Update: 2024-11-15 11:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Polls) వేళ అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు ఏర్పడ్డాయి. యోగి ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) తీవ్రంగ వ్యతిరేకించారు. దీనిపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాన్ని అజిత్‌ పవార్ అర్థం చేసుకోవాలని సూచించారు. ‘అజిత్ పవార్ దశాబ్దాలుగా లౌకిక, హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతోనే ఉన్నారు. సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారిలో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడమే లౌకికవాదమని భావించే వ్యక్తులతో ఆయన కొనసాగుతూ వచ్చారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పడుతుంది. గతంలో మాతో కలిసున్నవారు (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) దీనిని అర్థం చేసుకోలేరని విమర్శించారు.’ అని మండిపడ్డారు.

మహాయుతిలో విభేదాలు

ఇటీవల హర్యానా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి(Uttar Pradesh Chief Ministe) యోగి ఆధిత్యనాథ్‌ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదం చేశారు. ఈ నినాదాన్ని మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి అన్వయించడాన్ని డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర్ ప్రదేశ్‌, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమో కానీ.. మహారాష్ట్రలో పనిచేయదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ బీజేపీ నాయకులు పంకజా ముంబే, అశోక్‌ చవాన్‌ కూడా ఈ నినాదాన్ని విభేదించారు. దీంతో, మోడీ ఈ నినాదాన్ని ‘ఏక్ హై తో సేఫ్ హై’గా మార్చారు. ఇకపోతే, మహారాష్ట్రలో గురువారం నాటి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి అజిత్‌ పవార్‌ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చశనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags:    

Similar News