Haryana elections: హర్యానా ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం.. ఖర్గేకు ఈసీ లేఖ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం(EC) తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఇప్పటికైనా ఎన్నికల అనంతరం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun karge)కు ఈసీ లేఖ రాసింది. ‘ఓటింగ్(voting), కౌంటింగ్(counting) సమయంలో బాధ్యతారాహిత్య ఆరోపణలు చేయడం సరికాదు. దీనివల్ల పొలిటికల్ పార్టీల మధ్య ఆందోళణ నెలకొనే ప్రమాదం ఉంది. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిషన్ అభినందిస్తుంది. కాలంలో ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడి ఉంటుంది’ అని పేర్కొంది. మరోసారి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని తెలిపింది.
కాగా, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని పేర్కొంంది. అంతేగాక 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లు కొన్ని కేంద్రాల్లో 99 శాతం బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తుండగా, మరికొన్ని 60-70, 80 శాతం కంటే తక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పని చేస్తున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈసీ సమాధానం ఇచ్చింది. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది.