US Elections: స్వింగ్ స్టేట్స్‌లో కమలా, ట్రంప్ మధ్య గట్టి పోటీ
ఇప్పటికే ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. దీంతో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌పై అందరి దృష్టి ఉంది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 24 గంటలు మాత్రమే మిగిలుంది. ఈ సమయంలో ఇరు పార్టీల అభ్యర్థులు కమలా హ్యారిష్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ అత్యంత తీవ్రంగా ఉందని న్యూయార్క్ టైమ్, సియెనా కాలేజ్ పోల్ పేర్కొంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌లో ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా ఉందని పోల్స్‌లో తేలింది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ జరుగుతోంది. దీంతో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌పై అందరి దృష్టి ఉంది. నార్త్ కరొలినా, నెవాడా, విస్కాన్సిన్ కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారని, ఆరిజోనాలో ట్రంప్ ముందున్నారు. జార్జియా, పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పెన్సిల్వేనియాలో తీవ్రమైన పోటీ తర్వాత 4 శాతం పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న హ్యారిస్‌ను దాటి ట్రంప్ మద్దతు పెరిగినట్టు సమాచారం. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కాకుండా చాలామంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అమెరికాలో మొత్తం 24 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.