Family Suicide Attempt : బ్యాంకు ఏజెంట్ల వేధింపులు.. ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్

బ్యాంకు లోను చెల్లించడం లేదని ఏజెంట్లు వేధించడంతో ఓ కుటుంబం విషపూరిత సల్ఫస్ ట్యాబ్లెట్లను సేవించి ఆత్మహత్యకు యత్నించింది.

Update: 2024-11-16 15:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బ్యాంకు లోను చెల్లించడం లేదని ఏజెంట్లు వేధించడంతో ఓ కుటుంబం విషపూరిత సల్ఫస్ ట్యాబ్లెట్లను సేవించి ఆత్మహత్యకు యత్నించింది. తండ్రి మరణించగా కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్హయ్య మహతో అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పలు ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. అయితే లోన్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఎనిమిదేళ్ల ఆటో డ్రైవర్ చిన్న కుమారుడు రాకేష్ ట్యాబ్లెట్లను నోట్లో వేసుకోగానే ఉమ్మివేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బాధితులను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన భాగల్ పూర్‌లోని మాయాగంజ్ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News