బ్రేకింగ్ న్యూస్.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా Gulam Nabi Azad అడుగులు?
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీతో తన 50 ఏళ్ల బంధాన్ని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెంచుకున్నారు. గ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీతో తన 50 ఏళ్ల బంధాన్ని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెంచుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. G-23లో కీలక నేతగా ఉన్న ఆయన.. సీనియర్లందరినీ కలుపుకుని పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనను కాంగ్రెస్ అధినాయకత్వం పట్టించుకోకపోవడం, గాంధీయేతర నాయకులను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షలుగా పరిశీలించే విషయంలో ఆజాద్ ను గుర్తించకపోవడం, రాహుల్ తో కోల్డ్ వార్ ఆయన రాజానామాకు కారణాలనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతగా, దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న ఆజాద్ ఊహించని విధంగా రాజీనామా చేయడం కాంగ్రెస్ శ్రేణులను షాక్ కు గురి చేసింది.
ఈ క్రమంలో ఓ వార్త జాతీయ మీడియాలో సంచలనం రేపుతోంది. గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక ప్రాంతీయ పార్టీనా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దేశంలో చాలామంది రాజకీయ నేతలతో, పార్టీల అగ్రనేతలతో గులాంనబీ ఆజాద్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అజాత శత్రువుగా ఆయనను భావిస్తారు. ఇలాంటి తరుణంలో ఆజాద్ నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. కొత్త పార్టీ పెడతారా? లేదా వేరే పార్టీలో చేరతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీతో గులాం నబీ ఆజాద్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీకి అత్యంత ఆప్తుడిగా ఆయనకు పేరుంది. మోదీ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ కూడా ప్రకటించింది. గులాంనబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మోదీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దీంతో గులాంనబీ ఆజాద్ బీజేపీలో చేరతారానే ప్రచారం కూడా జరుగుతోంది.