Budget 2024: గుడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో మార్పులు

అందరూ ఊహించినట్లుగానే కొత్తపన్ను విధానంలో మార్పులు చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Update: 2024-07-23 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అందరూ ఊహించినట్లుగానే కొత్తపన్ను విధానంలో మార్పులు చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో, కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట దక్కింది. స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంచింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు జీరో ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. రూ.3 లక్షల నుంచి- రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను విధించింది. రూ.7 లక్షల- రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను విధించింది. రూ.10 లక్షల-12 లక్షల వరకు 15 శాతం సుంకం విధించింది. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల 20 శాతం పన్ను విధించగా.. రూ.15 లక్షల పైన ఉన్నవారికి 30 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపింది. కాగా.. కొత్త విధానం వల్ల రూ.17,500 పన్ను ఆదా కానున్నట్లు తెలిపింది.


Union Budget : కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు 


Click Here For Budget Updates!


Tags:    

Similar News