14 కాంబినేషన్ డ్రగ్స్ పై కేంద్రం నిషేధం
పారాసెటమాల్+నిమెసులైడ్.. క్లోఫెనిరమైన్+కోడైన్ సిరప్ సహా 14 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
న్యూఢిల్లీ: పారాసెటమాల్+నిమెసులైడ్.. క్లోఫెనిరమైన్+కోడైన్ సిరప్ సహా 14 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మందులకు చికిత్స పరంగా సమర్థత లేదని.. పైగా ప్రజలకు ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిషేధించిన ఔషధాల్లో సాధారణ అంటు వ్యాధులు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే క్లోర్‌ఫెనిరమైన్ మలేట్+కోడైన్ సిరప్, ఫోల్‌కోడిన్+ప్రోమెథాజైన్, అమోక్సిసిలిన్+బ్రోమ్‌హెక్సిన్, బ్రోమ్‌హెక్సిన్+డె డెక్స్, ట్రోమెథోర్ఫాన్+పారాసెటమ్+మెంథియమ్ క్లోరైడ్ ఫినైల్ ఫ్రైన్+క్లోర్‌ఫెనిరమైన్+గుయిఫెనెసిన్, సాల్బుటమాల్+బ్రోమ్‌హెక్సిన్ ఔషధాలు కూడా ఉన్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశంతో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సులను బట్టి.. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల తయారీ, పంపిణీ, అమ్మకాన్ని నిషేధించామని తెలిపింది. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను స్థిర నిష్పత్తిలో కలిపిన డోస్.