అయోధ్య రామభక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఛానెల్ లో ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్

దేశంలోని రామభక్తుల చిరకాల స్వప్నం ఇటీవలే నెరవేరిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-12 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:దేశంలోని రామభక్తుల చిరకాల స్వప్నం ఇటీవలే నెరవేరిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీంతో బాలరాముడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు అయోధ్యకు తరలి వెళుతున్నారు. ఈ క్రమంలో రామభక్తులకు దూరదర్శనం ఛానల్ మరో శుభవార్త చెప్పింది. రామ్ లల్లా భక్తులు ప్రతిరోజూ అయోధ్య నుండి నేరుగా 'ఆరతి' సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని డీడీ ఛానెల్ వెల్లడించింది. ఉదయం 6:30 గంటలకు అయోధ్యలోని రామ మందిరం నుండి రోజువారీ హారతిని ప్రసారం చేయబడుతుందని దూరదర్శన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో అయోధ్యకు వెళ్లి రాముడిని దర్శించుకోలేని భక్తులు ఇకపై ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షంచవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత జనవరి 23న అయోధ్య రామ మందిరంలో భక్తులను అనుమతిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 75 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని వారాంతంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News