Shashi Tharoor: మనకు మంచిదే.. ట్రంప్ విజయంపై శశి థరూర్ రియాక్షన్
అయితే వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాల్లో సవాళ్లకు భారత్ సిద్ధంగా ఉండాలన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి రావడంతో, కాంగ్రెస్ నేత శశి థరూర్ భారత్-యూఎస్ సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. అయితే చైనాపై ట్రంప్ కఠినమైన వైఖరి భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. 'ట్రంప్ చైనాపై చాలా కఠినంగా ఉంటారు. ఇది మనకు మంచిది. చైనాతో మనకున్న సమస్యల కారణంగా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని' తెలిపారు. ఇప్పటికే ఉన్న భారత్, యూఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పటిష్టం కావొచ్చు. అయితే వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాల్లో సవాళ్లకు భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ట్రంప్ సాధారణంగా సూటిగా మాట్లాడే వ్యక్తి. గతంలో నాలుగేళ్లు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని విధానంపై స్పష్టత ఉంది. భారత ప్రభుత్వానికి ట్రంప్‌తో మెరుగైన సంబంధాలు ఉన్నాయి. వాణిజ్యానికి సంబంధించి గతంలోనే ట్రంప్ భారత సుంకాలపై విమర్శలు చేశారు. ఇది గమనించవలసిన విషయమని థరూర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్‌నకు ఉన్న బలమైన సంబంధాలు భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటాయని, ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని థరూర్ వెల్లడించారు.