విచారణకు టైం ఇవ్వండి: జార్ఖండ్ సీఎంకు మరోసారి ఈడీ సమన్లు!

భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం మరోసారి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Update: 2024-01-27 10:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం మరోసారి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. విచారణకు సమయం, స్థలాన్ని త్వరలోనే నిర్ణయించాలని తెలిపింది. 29 నుంచి 31 తేదీల్లో ఇన్వెస్టిగేషన్‌కు టైం ఇవ్వాలని.. లేదంటే మేమే వస్తామని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ సొరేన్‌కు సమన్లు పంపడం ఇది తొమ్మిదోసారి. గతంలో ఎనిమిది సార్లు సమన్లు పంపగా..8వ సారి విచారణకు అంగీకరించారు. దీంతో ఈనెల 20న సీఎంను రాంచీలోని తన నివాసంలో ఈడీ అధికారులు 7గంటలకుపైగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. కాగా, భూ కుంభకోణం కేసులో కీలక నిందితుల్లో ఒకరైన భాను ప్రతాప్ ఇంటి నుంచి లభించిన పత్రాల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది.  

Tags:    

Similar News