Ghaziabad Court : జడ్జి వర్సెస్ లాయర్.. ఘజియాబాద్ కోర్టులో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు రణరంగంగా మారింది. ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జి, లాయర్ల మధ్య ఘర్షణ జరిగింది.

Update: 2024-10-29 10:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు(Ghaziabad Court) రణరంగంగా మారింది. ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జి(Judge), లాయర్ల (Lawyer) మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. అడ్వకేట్ నహర్ సింగ్ యాదవ్(Nahar singh yadav) ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను మరొక కోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తి అనిల్ కుమార్‌(Anilkumar)ని కోరారు. ఈ విషయంపై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో జడ్జి చాంబర్(Judge chamber) ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జడ్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే పలు మార్లు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టుకు చేరుకుని న్యాయవాదులను కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన న్యాయవాదులు కోర్టు కాంప్లెక్స్‌(Court complex)లోని పోలీసు పోస్టు(Police post)ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడినట్టు తెలుస్తోంది. అనంతరం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పరిస్థితిని సమీక్షించడానికి బార్ అసోసియేషన్(Bar association) సమావేశానికి పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై వెస్ట్ యూపీ అడ్వకేట్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లాఠీచార్జికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.  

Tags:    

Similar News