GBS: పూణేలో కలకలం రేపుతున్న కొత్త రకం వైరస్.. 71 కి చేరిన సంఖ్య
మహారాష్ట్ర(Maharastra)లోని పూణే(Pune)లో కొత్త రకం వైరస్(New Virus) కలకలం సృష్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Maharastra)లోని పూణే(Pune)లో కొత్త రకం వైరస్(New Virus) కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 71 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. పూణేలో గులియన్ బారే సిండ్రోమ్(Guillain-Barre Syndrome) అనే న్యూరోలాజికల్ డిజార్డర్(neurological disorder) కేసులు భారీగా వస్తున్నాయి. మరో ఆరు కేసులు పెరగడంతో బాధితుల సంఖ్య 71కి చేరింది. ఇందులో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి వెంటిలేటర్(ventilator) పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government) అప్రమత్తమైంది.
ఆరోగ్యశాఖ ర్యాఫిడ్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ వైరస్ భారిన పడిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ వైరస్ వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుందని, దీంతో పక్షవాతం, నరాల బలహీనత, తిమ్మిర్లు లాంటివి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు వెల్లడించారు. అయితే గులియన్ బారే సిండ్రోమ్ పై పరిశోధన చేసేందుకు మహా ప్రభుత్వం పరీశోధనా టీంను ఏర్పాటు చేసింది. దీనిపై పరిశోధన జరిపిన వైద్యులు.. దీనికి చికిత్స లేదని, జీబీఎస్(GBS) బారిన పడిన వ్యక్తులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వెల్లడించారు.