ఏప్రిల్ 1 నుంచి ఈ మందుల ధరలు ప్రియం
దిశ, నేషనల్ బ్యూరో : పెయిన్ కిల్లర్లు, యాంటి బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు (ఏప్రిల్ 1) నుంచి పెరగనున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : పెయిన్ కిల్లర్లు, యాంటి బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు (ఏప్రిల్ 1) నుంచి పెరగనున్నాయి. ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ(ఎన్పీపీఏ) వెల్లడించింది. ఈ మేరకు ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్లో మందుల ‘టోకు ధరల సూచీ’(WPI)లో వార్షిక మార్పును ప్రకటించింది.పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ (Diclofenac) ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ (Ibuprofen) టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది. WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్ చేసిన ఫార్ములాల మందులపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు. ఈవిధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయోటిక్స్, యాంటీ మలేరియల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.