Free power: కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్..ఆ స్కీమ్ ద్వారా అందజేయనున్న కేంద్రం

ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ (RTS) ఇన్‌స్టాలేషన్‌లను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PM-SGMBY) స్కీమ్‌ను ప్రారంభించించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-23 16:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ (RTS) ఇన్‌స్టాలేషన్‌లను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PM-SGMBY) స్కీమ్‌ను ప్రారంభించించిన విషయం తెలిసిందే. తాజా బడ్జెట్‌లోనూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిచండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చిందని ఇప్పటివరకు 1.28కోట్ల రిజిస్ట్రేషన్లు జరగగా..14లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. దీనిని మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఉపాధి, వృద్ధి, పర్యావరణ ఆవశ్యకతలను సమతుల్యం చేసే తగిన మార్గాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో శక్తి పరివర్తన కీలకమని పేర్కొన్నారు. ఇంధన పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి సోలార్ ప్యానెల్‌ల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ప్రతిపాదించారు. అంతేగాక విద్యుత్ నిల్వ కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. కాగా, పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

Tags:    

Similar News