Arvind Kejriwal: ఉచిత విద్య, వైద్యం అందించడం ఉచితాలు ఇవ్వడం కాదు: కేజ్రీవాల్

Free Education and Health not Freebies, Says Arvind Kejriwal| దేశ అభివృద్ధికి ఉచిత విద్య, వైద్యం ఎంతో ముఖ్యమని, కానీ వాటిని ప్రభుత్వం ఇచ్చే ఉచితాలుగా పరిగణించకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఒక్క తరం ఉత్తమ విద్య అందుకుంటే పేదరికాన్ని నిర్మూలనలో

Update: 2022-08-15 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: Free Education and Health not Freebies, Says Arvind Kejriwal| దేశ అభివృద్ధికి ఉచిత విద్య, వైద్యం ఎంతో ముఖ్యమని, కానీ వాటిని ప్రభుత్వం ఇచ్చే ఉచితాలుగా పరిగణించకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఒక్క తరం ఉత్తమ విద్య అందుకుంటే పేదరికాన్ని నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం అందించి తానేమైనా తప్పు చేశా అని కేజ్రీవాల్ అడిగారు.

'మనం ప్రభుత్వ ఆసుపత్రుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మార్చేశాం, దాంతో పాటుగా మొహల్లా క్లీనిక్‌లను ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ఉచితాలు ఇవ్వడం కాదు' అని ఆయన అన్నారు. అయితే ఇటీవల ప్రధాని మోదీ 'ఉచితాల సంస్కృతి' లేదా ఓట్లు పొందేందుకు ఉచితాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా హెచ్చరించారు. మోదీ మాట్లాడుతూ.. ఉచితాలు మెడికల్ కాలేజీలను, ఎయిర్ పోర్ట్‌లను ఇవ్వవని, ఏవైన ఉచితంగా ఇస్తే రోడ్లు, విమానాశ్రయాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన సంక్షేమ పథకాలను సమర్థించుకున్నారు.

ఇది కూడా చదవండి: స్వాతంత్ర్య సమరయోధులను చిన్న చూపు చూసేందుకు బీజేపీ ప్రయత్నం: సోనియా

Tags:    

Similar News