బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జి

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఇటీవల రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-03-07 11:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఇటీవల రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరి అంచనాలను నిజం చేస్తూ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. గురువారం రోజు అభిజిత్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ కండువా కప్పి అభిజిత్ గంగోపాధ్యాయ‌ను కమలదళంలోకి ఆహ్వానించారు. ‘‘ఇవాళ నేను కొత్త రంగంలోకి చేరాను. బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉంది. పార్టీలో సైనికుడిలా పని చేస్తాను. అవినీతిమయ మమతా బెనర్జీ పాలనను బెంగాల్ నుంచి తరిమికొట్టడమే మా లక్ష్యం’’ అని అభిజిత్ గంగోపాధ్యాయ‌ చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు అభిజిత్ గంగోపాధ్యాయ వంటి వ్యక్తి అవసరమని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి తెలిపారు.

Tags:    

Similar News