పూంచ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఫొటోలు ఇవే
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా షాసితార్ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం (మే 4న) దాడికి తెగబడిన ముగ్గురు టెర్రరిస్టుల వివరాలు వెల్లడయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా షాసితార్ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం (మే 4న) దాడికి తెగబడిన ముగ్గురు టెర్రరిస్టుల వివరాలు వెల్లడయ్యాయి. ఆ ఉగ్రవాదులను ఇలియాస్ ఫౌజీ (మాజీ పాక్ ఆర్మీ కమాండో), అబూ హంజా (లష్కరే తైబా కమాండర్), హదూన్‌లుగా గుర్తించారు. వారి ఫొటోలు కూడా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్‌ఎఫ్) తరఫున ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి ఆచూకీ కోసం రాజౌరి, పూంచ్ అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పాయి. పలువురు అనుమానితులను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులతో సంబంధాలపై వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మే 4న జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత వాయుసేన సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి.చికిత్స పొందుతూ వారిలో ఒకరు (విక్కీ పహాడే) మృతిచెందారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డును ఇస్తామని ఆర్మీ ప్రకటించింది.