కాసేపట్లో BJP లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా

దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, ఆశావహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది.

Update: 2024-03-02 11:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, ఆశావహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కానుంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాయలంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాబితా విడుదల చేయనున్నారు. అనంతరం నడ్డా ప్రెస్‌మీట్ కూడా నిర్వహించనున్నారు. కాగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థుల జాబితాపై మూడు, నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి, గెలుపు గుర్రాలను ఫిల్టర్ చేసి ఫైనల్ చేసినట్లు సమాచారం.

దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే, బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన స్థానాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రుల బృందాలను కూడా క్షేత్రస్థాయిలోకి పంపారు. ఈ స్థానాల్లో గెలుపు అవకాశాలు పెరిగాయని పార్టీ భావిస్తోంది. ఈ తొలి జాబితాలో ఆ స్థానాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News