HD Kumaraswamy : కేంద్ర మంత్రి కుమార స్వామికి బిగ్ షాక్
కేంద్ర మంత్రి హెచ్ డీ కుమార స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీయూ పార్టీ అగ్రనేత హెచ్ డీ కుమార స్వామి (HD Kumaraswamy)పై కేసు నమోదు అయింది. ఏడీజీపీ, సిట్ చీఫ్ ఎం. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్ పై పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. 2006 నుంచి 2008 వరకు కర్నాటక (Karnataka) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బళ్లారి జిల్లాలోని శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ (SSVM Minerals) కు 550 ఎకరాల మైనింగ్ లీజుకు చట్టవిరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నది ఈ విచారణ బృందానికి చంద్రశేఖర్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే మైనింగ్ కేసులో విచారణను అడ్డుకునేందుకు కుమారస్వామి, నిఖిల్ (Nikhil) ప్రయత్నిస్తున్నారని చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.