ఇండియా కూటమి ర్యాలీలో రచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు

ప్రతిపక్ష ఇండియా కూటమి జార్ఖండ్ లోని రాచి వేదికగా నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు కొట్టుకున్నారు.

Update: 2024-04-21 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రతిపక్ష ఇండియా కూటమి జార్ఖండ్ లోని రాచి వేదికగా నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు కొట్టుకున్నారు. ఉల్గులన్ న్యాయ్ మహార్యాలీ పేరుతో జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం ఈ ర్యాలీని నిర్వహించగా ఈ సందర్భంగా ఓ వైపు కార్యక్రమం జరుగుతుండగా మరో వైపు కార్యకర్తలు కుర్చీలతో పరస్పరం గొడవకు దిగడం కలకలం రేపింది. తలలు పగిలి రక్తం కారేలా కొట్టుకున్నారు. దీంతో ర్యాలీలో గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ సెటైర్లు వేసింది. ఇండియా కూటమికి దేశం పట్ల ఎటువంటి మిషన్, విజన్ లేదని బీజేపీ నేషనల్ స్పోక్ పర్సన్ షెహజాద్ జై హింద్ విమర్శించారు. గందరగోళం సృష్టించి కుటుంబ పాలనను కొనసాగించాలనుకోవడమే ఆ కూటమి లక్ష్యం అన్నారు. ఇది బ్రష్టాచార్ బచావ్ ర్యాలీ అని ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమని కల్పనా సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతతో పాటు , నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరయ్యారు.

జైల్లో ఉన్న వారికి కుర్చీలు:
ఈ సభలో ఆసక్తికరమైన సీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ర్యాలీ వేదికపై జైలులో ఉన్న వారి కోసం కుర్చీలను ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈడీ కేసులో జైల్లో ఉన్న హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ కు చైర్లు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 





 


Tags:    

Similar News