FBI: భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు అత్యంత నమ్మకస్తుడు, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel)కు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు అత్యంత నమ్మకస్తుడు, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు ఆయన అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ (FBI)కి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా కాష్ పటేల్ (Kash Patel)కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ఖరారు అయింది. రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న సెనేట్ (Senate)లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు (Republican Senators) పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్ చేయడంతో కాష్ పటేల్ (Kash Patel)కు గెలుపు మరింత సులువు అయింది.
ఈ నేపథ్యంలోనే మైనే (Maine), అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్ (Susan Collins), లీసా ముర్కోస్కీ (Lisa Murkowski)లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియమాకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న డెమొక్రాట్లు (Democrats) కూడా కాష్ పటేల్ నియమాకంపై పెదవి విరిచారు. కాష్‌ను చీఫ్‌గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని ఆరోపించారు. ఆయన ఓ పక్కా వేర్పాటువాది అని ఫైర్ అయ్యారు. కుట్రలను ప్రోత్సహించడం, క్యాపిటల్ హిల్ (Capital Hill)పై దాడికి పాల్పడిన ట్రంప్ మద్దతుదారులను సమర్థించడం, రిపబ్లికన్ అధ్యక్షుడిని వ్యతిరేకించే వారిపై ఆరోపణలు వంటి అంశాలపై డెమొక్రాట్లు (Democrats) మండిపడ్డారు. ఎదుర్కొన్నారు.