ఐదేళ్ల కొడుకును నడి సముద్రంలో వదిలేసిన తండ్రి
సరదాగా పిల్లలను బయటకు తీసుళ్లినప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త పడుతారు.
దిశ, వెబ్‌డెస్క్: సరదాగా పిల్లలను బయటకు తీసుళ్లినప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త పడుతారు. కానీ, ఓ తండ్రి మాత్రం ఐదేళ్ల కుమారుడ్ని నడి సముద్రంలో వదిలేసి తాను ఎంజాయ్ చేశాడు. ఈ ఘటన ఫారెన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండ్రి, కుమారులిద్దరూ సర్పింగ్ కోసమని సముద్రంలోకి వెళ్లారు. అబ్బాయిని మధ్యలోనే వదిలేసి తండ్రి హ్యాపీగా సర్పింగ్ చేస్తూ.. కొంత దూరం వరకు వెళ్లాడు. దీంతో అలలు ఒక్కసారిగా దూసుకురావడంతో బాలుడు నీటిలో పడబోయాడు. మళ్లీ ఎలాగోలా పట్టుకొని పైకి వచ్చాడు.
అదే సమయంలోనే ఆ బాలుడికి పెద్ద షార్క్ కూడా కనిపించింది. షార్క్ ఆ పిల్లాడిని చూడలేదు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే దానికి ఆహారం అయ్యేవాడు. కొంతసేపటికి తండ్రి వచ్చాక.. ‘‘నేను పెద్ద జంతువు చూశాను డాడీ’’ అని పిల్లాడు చెబుతున్నా కూడా వినిపించుకోలేదు. అలాగే అది ఫిష్ అని కవర్ చేస్తూ నవ్వాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఒక తండ్రి బిడ్డ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇప్పటివరకు 7 మిలియన్ మంది చూసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.