Rajya Sabha: నేను రైతు కుమారుడ్ని.. భయపడబోను.. రాజ్యసభలో ధంఖర్ వర్సెస్ ఖర్గే

రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha chairman)గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Vice President Jagdeep Dhankar) పై పార్లమెంటులో రగడ జరిగింది.

Update: 2024-12-13 08:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభ ఛైర్మన్(Rajya Sabha chairman)గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్(Vice President Jagdeep Dhankar) పై పార్లమెంటులో రగడ జరిగింది. ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షాలు,విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. నినాదాలు, నిరసనల మధ్య రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. గందరగోళ పరిస్థితుల మధ్యే ఎగువసభలో ఛైర్మన్ ధంఖర్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) మధ్య వాగ్వాదం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ధంఖర్.. తాను రైతు కుమారుడినని.. రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడకు భయపడబోనని అన్నారు. ‘‘నేను రైతు కుమారుడిని.. బలహీన పడను.. నా దేశం కోసం ప్రాణాలర్పిస్తాను.. మీకు (ప్రతిపక్షాలకు) 24 గంటలూ ఒకే ఒక పని, రైతు కొడుకు ఛైర్మన్ పదవిలో ఎందుకు ఉన్నాడు అని ఆలోచించడమే. నేను ఇప్పటివరకు చాలా భరించాను.. తీర్మానాన్ని తీసుకొచ్చే హక్కు మీకు ఉంది. కానీ, మీరు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు" అని ధంఖర్ అన్నారు. మరోవైపు, ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడంతో బీజేపీ ఫైర్ అయ్యింది. ఇది జాట్ కమ్యూనిటీని, రైతు కుమారుడ్ని అవమానిండమే అని పేర్కొంది.

ఖర్గే ఏమన్నారంటే?

ఇక, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ ఛైర్మన్ ధంఖర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన కాంగ్రెస్ నేతలను అవమానించారని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపి ఎంపీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. “ఇతర పార్టీల సభ్యులపై మాట్లాడమని (బీజేపీ) సభ్యులను ప్రోత్సహిస్తున్నారు.. నేను కూడా కూలీ కొడుకునే.. మీకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నాను.. మా పార్టీ నేతలను అవమానిస్తున్నారు. కాంగ్రెస్‌ను అవమానిస్తున్నారు. మీ ప్రశంసలు వినేందుకు మేం ఇక్కడికి రాలేదు, చర్చ కోసం వచ్చాం’’ అని ఖర్గే అన్నారు.

Tags:    

Similar News